రూ. 3 లక్షల్లోపు ఆదాయం ఉన్నా.. పూచీకత్తు లేకుండా రూ. 1.25 లక్షల వరకు లోన్.. పూర్తి వివరాలివే..

Wait 5 sec.

: సాధారణంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో లోన్లు.. ఆదాయాన్ని బట్టి అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ లోన్ అమౌంట్‌ను బట్టి జీతం లేదా ఆదాయం ఇంత ఉండాలని పరిమితులు విధిస్తుంటాయి. ఇంకా . ఇందులోనే ఒకటి మైక్రోఫైనాన్స్ రుణాలు. ఇక్కడ ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. తక్కువ ఆదాయ వర్గాల వారికి.. మహిళా వ్యవస్థాపకులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. రూ. 3 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నా.. ఈ మైక్రోఫైనాన్స్ లోన్లకు అర్హులు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఇక్కడ లోన్ రూ. 10 వేల నుంచి గరిష్ఠంగా రూ. 1.25 లక్షల వరకు వస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు దాటొద్దు. వడ్డీ రేట్లు మాత్రం ఇక్కడ బ్యాంకుల కంటే కాస్త ఎక్కువగా ఉండొచ్చు. లోన్ తిరిగి చెల్లించే కాల పరిమితి తక్కువగానే ఉంటుంది. ఏడాది నుంచి మూడేళ్లలోపు లోన్ మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ లోన్ వాయిదాలు (EMI) కుటుంబ నెలవారీ ఆదాయంలో 50 శాతం దాటొద్దు. ఇక్కడ లోన్ ముందుగా చెల్లిస్తే ఎలాంటి పెనాల్టీ ఉండదు. అంటే అదనంగా ఛార్జీలు పడవు. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ సౌకర్యాలు ఉంటాయి. అంటే ఇక్కడ వారానికి ఓసారి, పక్షం రోజులకు ఓసారి, లేదా నెలవారీ ఆప్షన్ల కింద తిరిగి చెల్లించొచ్చు. ఈ లోన్ వడ్డీ రేట్లు సంస్థల్ని బట్టి మారుతుంటాయి. దీనిపై ఎలాంటి పరిమితి లేనప్పటికీ.. రుణ దాతలు మరీ అధికంగా వసూలు చేయొద్దు. బోర్డు ఆమోదించిన వడ్డీ రేట్లను విధించాలి. ఆర్బీఐ ఆమోదం పొందిన రుణ సంస్థలు మాత్రమే ఈ మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇచ్చేందుకు అర్హులు. వీటిల్లో కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు (RRBs), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, కోఆపరేటివ్ బ్యాంకులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (SHGs), NGOs, కమర్షియల్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ వంటివి ఉన్నాయి. ఇక్కడ మైక్రోఫైనాన్స్ లోన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం దగ్గర్నుంచి.. ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం లేదా స్కూల్ ఫీజులు చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ లోన్లలో ఎడ్యుకేషనల్ లోన్స్, ఎమర్జెన్సీ లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్, ఇన్‌కం జెనరేషన్ లోన్స్, కన్జూమర్ ప్రొడక్ట్ లోన్స్, ఇండివిడ్యువల్ బిజినెస్ లోన్స్ వంటివి ఉంటాయి.