భీకర యుద్ధం.. బంగారం ధరల్లో భారీ జంప్.. తనిష్క్, మలబార్ సహా జువెలరీల్లో గ్రాము గోల్డ్ ఎంతంటే

Wait 5 sec.

22K Gold Price: ఇరాన్‌పై అమెరికాతో పాటు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ క్రమంలో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. ఈరోజు ఉదయం ఈ దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు చేసి ఆయన్ని మట్టుబెట్టాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.17 వేలు దాటేసింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బంగారం ధరలు ఊహించని విధంగా ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకోవచ్చని బులియన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెండి ధరలు సైతం భారీగా పెరగవచ్చని చెబుతున్నాయి. సాధారణంగానే యుద్ధం ఎక్కడ జరిగినా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌ కరెన్సీ రూపాయి విలువ బలహీనపడడంతో కరెంట్ ఖాతా లోటు పెరిగేందుకు కారణమవుతుంది. ఈ క్రమంలో ప్రముఖ జువెలరీల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తనిష్క్ జువెలరీలోతనిష్క్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 1 గ్రాముకు రూ.400 మేర పెరిగింది. దీంతో గ్రాము రేటు రూ.15,905 స్థాయికి ఎగబాకింది. క్రితం రోజు రూ.655 మేర పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో తులం బంగారం (10 గ్రాములు) ధర రూ.1,59,050 వద్దకు చేరుకుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లోమలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ. 400 మేర పెరిగి రూ.15,865 వద్దకు చేరింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,58,650 వద్ద ట్రేడవుతోంది. జొయాలుక్కాస్‌లోదీంతో గ్రాము బంగారం రేటు రూ.15,865 వద్దకు చేరుకుంది. అలాగే తులం ధర చూసుకుంటే రూ.4000 పెరిగింది. దీంతో 10 గ్రాములకు రూ.1,58,650 వద్దకు చేరింది. కల్యాణ్ జువెలరీల్లోకల్యాణ్ జువెలరీల్లో ఈరోజు ఆభరణాల బంగారం (22 క్యారెట్లు) ధర 1 గ్రాముకు రూ.400 పెరిగి రూ.15,865 వద్ద ట్రేడవుతోంది. ఇక పది గ్రాముల తులం బంగారం రేటు చూసుకుంటే రూ.4000 పెరిగి రూ.1,58,650 వద్దకు దూసుకెళ్లింది. లలితా జువెలరీల్లోలలితా జువెలరీల్లోనూ ఈరోజు బంగారం ధర పెరిగింది. 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం రేటు రూ.400 పెరగడంతో రూ. 15,865 వద్దకు చేరింది. తులం బంగారం రేటు రూ.1,58,650 పలుకుతోంది.