మార్చి మూడో తేదీ ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ స్థానిక ఆలయాలను కూడా మూసివేయనున్నారు. మార్చి మూడో తేదీ మంగళవారం ఉదయం తిరుపతితో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని టీటీడీ స్థానిక ఆలయాలను మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి చేయనున్నారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మరోవైపు మార్చి మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు గ్రహణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయాల తలుపులు మూసివేయనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం మూసివేయనున్నారు.అలాగేకార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయం, నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయం, బుగ్గలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయం, నగరి కరియమాణిక్యస్వామి ఆలయాలను మూసివేయనున్నారు. అలాగే తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ‌స్వామి ఆలయం, వాయల్పాడు పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యాల‌ను కూడా మూసివేయనున్నారు. మార్చి మూడో తేదీ ఉదయం 9 గంటలకు మూసివేయనున్న అర్చకులు.. గ్రహణం పూర్తైన తర్వాత రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తారు. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా , వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే తిరుపతి, తిరుచానూరులో కూడా మూసివేయనున్నారు. ఆలయాన్ని కూడా పదిన్నర గంటల పాటు మూసివేయనున్నారు.