సీనియర్లకు ఇప్పుడిదే బెస్ట్ FD ఆప్షన్.. 8 శాతం వడ్డీ.. 5 లక్షలకు ఏ బ్యాంకులో ఎంతొస్తుంది?

Wait 5 sec.

FD Rates: గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును ఏకంగా 1.25 శాతం మేర తగ్గించింది. దీంతో బ్యాంకులు సైతం తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఆ స్థాయిలోనే కోత పెట్టాయి. దీంతో ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలో తెలియక చాలా మంది ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. అయితే, సీనియర్ సిటిజన్లు సురక్షితమైన పెట్టుబడిగా బ్యాంకు డిపాజిట్లనే ఎంచుకుంటాయి. దీంతో వారు ఏ బ్యాంకు ఎంచుకోవాలో తెల్చుకోలేకపోతున్నారు. వారందరికీ ఇప్పటికీ గరిష్ఠ వడ్డీ రేటు పొందే ఛాన్స్ ఉంది. వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు 8 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల జాబితా తెలుసుకుందాం. అలాగే ఆ బ్యాంకుల్లో రూ.5 లక్షల జమ చేసినట్లయితే 3 ఏళ్ల కాలానికి ఎంతొస్తుంది? అనేది ఇప్పుడే మనం తెలుసుకుందాం. () 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే జమ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (Jana Small Finance Bank) సైతం 3 ఏళ్ల టెన్యూర్ పై 8 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలు జమ చేసినట్లయితే 3 ఏళ్ల తర్వాత చేతికి అసలు, వడ్డీ కలిపి రూ. 6,20,000 వరకు లభిస్తాయి. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan Small Finance Bank) సీనియర్ సిటిజన్లకు 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు 7.7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే మూడేళ్ల తర్వాత చేతికి అసలు, వడ్డీ కలిపి రూ. 6,15,500 వరకు లభిస్తాయి. ఇక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (AU Small Finance Bank) సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. మూడేళ్ల టెన్యూర్లపై గరిష్ఠ వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే చేతికి రూ.6,14,000 వస్తాయి. నీ, ఈ బ్యాంకుల్లోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. బ్యాంక్ దివాలా తీసినా ఆర్‌బీఐ నుంచి బీమా సొమ్ము రూ.5 లక్షలు లభిస్తుంది. కాబట్టి స్మాల్ డిపాజిటర్లు నిశ్చింతగా ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు.