Gold Rate On Feb 26: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా బంగారానికి గిరాకీ పెరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. అలాగే ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడుల పెడుతున్నారు. సురక్షితమైన మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి రేట్లు మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. . ఈరోజు సైతం ధరలు మళ్లీ పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్‌లో వరుసగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. చాలా మంది ధర ఎంతైనా తప్పనిపరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి రేట్లు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 50 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ పసిడి ధర 5207 డాలర్లు దాటి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈరోజు 4 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 90 డాలర్లు దాటేసింది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్ల బంగారం ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. వారం రోజుల నుంచి పెరుగుతూ మళ్లీ రికార్డ్ గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.100 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,48,400 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.110 మేర పెరిగి రూ. 1,62,890 వద్దకు చేరుకుంది. రూ.5000 పెరిగిన వెండి క్రితం రోజు రూ.10 వేల మేర తగ్గి ఊరట కల్పించిన వెండి ఈరోజు మళ్లీ పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,95,000 మార్క్ వద్దకు చేరుకుంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేటు ఫిబ్రవరి 26వ తేదీన గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, మధ్యాహ్నం లోపు బులియన్ మార్కెట్లో ధరలు మారిపోతుంటాయి. ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానిక ధరలను తనిఖీ చేయడం మంచిది.