: దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ అధినేత సమస్యల వలయంలో చిక్కుకున్నారు. కొంత కాలం కిందట తన కంపెనీల అప్పులు వరుసగా చెల్లించి రుణ విముక్తి చేసి తిరిగి పుంజుకున్నారని భావించేలోపే కేసులు తలకు చుట్టుకున్నాయి. గతంలో రిలయన్స్ గ్రూప్ కంపెనీలు బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకొని అక్రమంగా ఇతర షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలతో ఈడీ, సీబీఐ ఇప్పటికే అనిల్ అంబానీ సహా ఆయన కంపెనీలపై కేసులు నమోదు చేశాయి. విచారణకు కూడా పలుమార్లు హాజరయ్యారు. అనిల్ అంబానీ ఆస్తుల్ని కూడా ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది. అనిల్ అంబానీ సహా ఆయన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై (RCom) కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. >> 2013-17 మధ్య కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేయడం ద్వారా సదరు బ్యాంకుకు రూ. 2,220 కోట్ల మేర నష్టాన్ని కలిగించారనేది ఆరోపణగా ఉంది. మంగళవారం రోజు బ్యాంక్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసు నమోదైన తర్వాత.. అనిల్ అంబానీ నివాసం సహా ఆర్‌కామ్ ఆఫీసుల్లో సోదాలు చేసి.. లోన్‌కు సంబంధించిన పలు పత్రాల్ని రికవరీ చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. . సుమారు 9 గంటలకుపైగా ఆయనను విచారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అనిల్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ గ్రూప్ షేర్లు శుక్రవారం రోజు మరింత పతనమై ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. రిలయన్స్ పవర్ షేర్ ధర ఇంట్రాడేలో 4 శాతానికిపైగా పతనమై రూ. 24.11 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 10.06 వేల కోట్లుగా ఉంది. ఇక రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ ధర కూడా 4 శాతానికిపైగా తగ్గి రూ. 89.70 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చరిత్రలో తొలిసారి ఈ స్టాక్ ధరలు ఈ స్థాయికి పడిపోయాయి. ఈ సంస్థ మార్కెట్ వాల్యూ రూ. 3.70 వేల కోట్లుగా ఉంది.