కోల్‌కతాలో శుక్రవారం భారీ వణికించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో సంభవించింది. దీంతో జనం ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. తొలుత బంగ్లాదేశ్‌లో భూకంపం చోటుచేసుకోగా.. కోల్‌కతా నగరంలోనూ తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు సహా భవనాల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల వెలుపల గుమిగూడారు. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కార్యాలయాల నుంచి ఉద్యోగులను అధికారులు బయటకు పంపారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఓ సభలో ప్రసంగిస్తుండగా భూప్రకంపనలతో కాసేపు ఆగిపోయారు. ఓ 63 ఏళ్ల మహిళ తాను కుర్చీపై కూర్చుని ఉండగా దానంతట అదే ఊగిందని, స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఫ్యాన్ కూడా కదిలిందని ఆమె చెప్పారు. ఇది ఐదు నిమిషాల పాటు కొనసాగిందని ఆమె పేర్కొంది. అయితే, భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. భూకంపం ఆగిపోయిన తర్వాత వస్తువులు వాటంతట అవే వేగంతో కదులుతుండటం ఆమె చూసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని అగర్గావ్‌లోని బీఎండీ సీస్మిక్ సెంటర్.. దేశ నైరుతి దిశలో రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. ప్రాణ, ఆస్తి నష్టం సహా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.