తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో, ఓ యువ ఇన్‌ఫ్లూయెన్సర్ జీవితాన్నే తలకిందులు చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ , దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో కలిసి తీసుకున్న వీడియో భారీ చర్చకు దారి తీసింది.ఈ వీడియో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం తీసింది. ఫేస్‌బుక్‌లో “డేవిడ్ మిల్లర్! ఎంత గొప్ప ఆటగాడు” అంటూ క్యాప్షన్ పెట్టిన ప్రిన్సీ, మిల్లర్‌‌తో మ్యాచ్ అనంతరం ఉన్న వీడియోను పోస్ట్ చేసింది.. దాంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే, ఈ వీడియో విడుదలైన తర్వాత తనకు అత్యంత అసభ్యకరమైన కామెంట్లు, శరీర అవమానాలు, రేప్ బెదిరింపులు వచ్చాయని ప్రిన్సీ వెల్లడించింది. ఈ కారణంగా ఫేస్‌బుక్ నుంచి వీడియోను తొలగించాల్సి వచ్చిందని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉంది.ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 187 పరుగులు చేయగా, మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులతో జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యి, 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో టీమిండియా రన్‌రేట్ -3.80కు వెళ్లింది. ఇదే మ్యాచ్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, మిల్లర్ అనుభవాన్ని ప్రశంసించాడు. అలాగే యువ ఆటగాడు డివాల్డ్ బ్రెవిస్ ఇన్నింగ్స్‌ను కూడా ప్రశంసించాడు. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రారంభంలో బాగా బౌలింగ్ చేసినప్పటికీ, మిల్లర్-బ్రెవిస్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని పేర్కొన్నాడు. అయితే, మ్యాచ్ అనంతరం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో ఐసీసీ కొన్ని ప్రమోషన్స్ చేయిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో ఆర్జే ప్రిన్సీ పరిఖ్ ఓ వీడియో బైట్ చేసింది. దాంతో రెచ్చిపోయిన కొందరు ఆమెను అసభ్యంగా తిడుతూ నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో మహిళల భద్రత, గౌరవం, బాధ్యతాయుత ప్రవర్తనపై మరోసారి చర్చను రేపుతోంది.