Latest Gold Silver Rates: బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇంకా పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాల్ని ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుంది. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితి సహా ఇతర కారణాలతో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరిగి.. ఇటువైపు పెట్టుబడులు పెరిగిపోయాయి. దీంతో ధర కూడా అంతకుమించి పెరుగుతూ పోయింది. బంగారం కేవలం అలంకరణగానే కాకుండా ఇంకా ఇటీవల పెట్టుబడి సాధనంగానే ఎక్కువగా డిమాండ్ పెంచుకుంది. బంగారం అనేది సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. ఇదే సమయంలో బంగారంతో పాటుగా వెండికి కూడా డిమాండ్ ఉంటుంది. ఇటువైపు కూడా ఇటీవలి కాలంలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. జనవరి ఆఖర్లో బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టగా.. . ఇవాళ కూడా మళ్లీ బంగారం ధర పెరిగింది. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర ఫిబ్రవరి 25న రూ. 400 పెరిగి తులం రూ. 1,48,300 వద్ద ఉంది. ముందటి రోజు ఇది రూ. 1900 పెరిగింది. అంతకుముందు కూడా వరుసగా రూ. 1750, రూ. 800, 2100 చొప్పున ఎగబాకింది. ఇలా వారం వ్యవధిలో రూ. 8 వేల వరకు ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ రూ. 430 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ. 1,61,780 గా ఉంది. ఇది కూడా వారం రోజుల్లో రూ. 8 వేల మేర ఎగబాకింది. పెరిగినప్పటికీ.. మరోవైపు మాత్రం దిగొచ్చింది. ఇప్పుడు ఒక్కరోజులో రూ. 10 వేలు తగ్గగా కేజీకి రూ. 2.90 లక్షలు పలుకుతోంది. ఇదిలా ఉండగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు కిందటి రోజుతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 5,180 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది 5,200 డాలర్ల మార్కు దాటి ట్రేడయింది. సిల్వర్ రేటు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 90.95 వద్ద ఉంది.