ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపికబురు.. ఇకపై 24 గంటల స్పీడ్‌ పోస్ట్, పార్శిల్‌ బుకింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 11 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో 24 గంటలూ స్పీడ్‌ పోస్ట్, పార్శిల్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు తపాలశాక అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సౌకర్యం విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుంతకల్లులలో అందుబాటులోకి వచ్చింది. ఈ సౌకర్యంతో పాటుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 242 ప్రధాన పట్టణాల్లో ఉన్న పనివేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు సాధారణ పని వేళలు 1 నుంచి 2 గంటలు పెంచినట్లు అధికారులు తెలిపారు. తపాలాశాఖకు సంబందించి.. ఐటీ 2.0 సాప్ట్‌వేర్‌ను జీపీవో, సబ్‌ పోస్ట్‌ ఆఫీసులకు అనుసంధానం చేశారు. ఆ తర్వాత పోస్టల్‌ సేవలు మరింత స్మార్ట్‌గా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా 24 గంటల సౌకర్యం కల్పించారు. ఏపీ ప్రభుత్వం అప్డేట్స్మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం తొమ్మిది మంది గ్రూప్‌-1 అధికారుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా నియమించారు.. వీరంతా ఇటీవల ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యారు. అయితే వీరందరిని తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ కలెక్టర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి 72 వారాల పాటూ శిక్షణ ఉంటుంది.. అనంతరం వీరిని జిల్లాల వారీగా విధుల్లో నియమిస్తారు. డిప్యూటీ కలెక్టర్లుగా నియమితులైన వారిలో.. కనపాల రాజా మాథ్యూ, యడసండ్రం సురేశ్‌, గూడూరు గీతాంజలి, పెనుమెత్స యోగిత సంజన, పెసల ప్రియంవద, భాగం నిఖిలశ్రీ, కె.లక్ష్మీ దీపిక, తొగట ప్రియాంక, సెటకం సాయి ప్రవల్లికలు ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ గనులశాఖ అడిషనల్ డైెరెక్టర్ డబ్ల్యూబీ చంద్రశేఖర్‌కు ప్రమోషన్ దక్కింది. ఈ మేరకు ఆయన్ను డైరెక్టర్‌ాగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చంద్రశేఖర్ కొంతకాలంగా గనులశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తాజాగా ఆయనకు పూర్తిస్థాయి ప్రమోషన్ వచ్చింది. అయితే చంద్రశేఖర్ ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్నారు. అయితే ఆ తర్వాత కూడా మరికొంత కాలం ఆయన్ను డైరెక్టర్‌‌గా కొనసాగించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.