డూ ఆర్ డై మ్యాచ్ ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ.. రింకూ ఫ్యామిలీలో సీరియస్, టీ20 వరల్డ్‌కప్ నుంచి ఔట్?

Wait 5 sec.

కు కీలక సమయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ హిట్టర్ అత్యవసరంగా ను వదిలేసి ఇంటికి వెళ్లాడు. దాంతో జింబాబ్వేతో జరిగే కీలక సూపర్-8 మ్యాచ్‌లో అతని పాల్గొనడం అనుమానంగా మారింది. గురువారం చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు రెండు రోజుల ముందే రింకూ చెన్నై విడిచిపెట్టినట్లు సమాచారం. మంగళవారం జరిగిన నెట్స్ సెషన్‌కు కూడా అతడు హాజరుకాలేదు.సమాచారం ప్రకారం, రింకూ తండ్రి ఖంచంద్ సింగ్ ఇటీవల అనారోగ్యంతో గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రింకూ వెంటనే కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. ప్రస్తుతానికి అతడు మళ్లీ జట్టులో చేరతాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన రింకూ, ఈ టోర్నీలో పెద్దగా రాణించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 24 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. .ఒకవేళ రింకూ చెన్నై మ్యాచ్‌కి అందుబాటులో లేకపోతే, భారత్ వాషింగ్టన్ సుందర్, అక్షర పటేల్ ఇద్దరితో ఆడించే అవకాశం ఉంది. అలాగే స్పిన్ అటాక్‌ను బలోపేతం చేసేందుకు కుల్దీప్‌ను తీసుకునే మరో ఛాన్స్ కూడా ఉంది. రింకూ సింగ్ ఇంటికి వెళ్లడంతో సూర్యకుమార్ యాదవ్‌కి ఇది మరో పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో ఓడి గ్రూప్‌లో వెనుకబడ్డ భారత్, ఇప్పుడు తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై గెలవడంతో పాటు వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే భారత్ సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8లో భారత్ నెట్‌రన్‌రేట్ -3.80గా ఉంది. సెమీస్ ఆశలు సజీవం చేసుకోవాలంటే జింబాబ్వేపై భారీ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా గెలవాల్సి ఉంటుంది. అలాగే అహ్మదాబాద్‌లో జరిగే మరో కీలక మ్యాచ్ ఫలితంపై కూడా భారత్ ఆశలు పెట్టుకోవాల్సి ఉంది. మొత్తంగా చూస్తే, రింకూ సింగ్ గైర్హాజరు టీమిండియా ప్లాన్స్‌ను గందరగోళంలోకి నెట్టింది.