యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్

Wait 5 sec.

: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం వార్త రాసే సమయంలో (ఉదయం 9.16 గంటలకు) 1000 పాయింట్లకుపైగా నష్టంతో 80,300 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే దాదాపు 300 పాయింట్ల నష్టంతో 24,900 దిగువన ట్రేడవుతోంది. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 7 వేల పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభం కావడం గమనార్హం. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 9 శాతం వరకు కుదేలైంది. తర్వాత మెల్లమెల్లగా కోలుకుంది. దేశీయంగా పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్ల కారణంగా భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా- ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు దిగింది. . ఇతర ముఖ్య నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా.. గల్ప్ దేశాలపైనా ఇరాన్ దాడులకు దిగింది. దీంతో యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్ల విక్రయానికి దిగారు.>> రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతం వరకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ సహా పలు హెవీ వెయిట్ స్టాక్స్‌లో కూడా తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ఇండిగో షేరు భారీ స్థాయిలో కుదేలైంది. ఇంట్రాడేలో 7 శాతం వరకు పడిపోగా ప్రస్తుతం 5 శాతం వరకు నష్టంతో ట్రేడవుతోంది. ఐటీ స్టాక్స్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఇలా ఇవన్నీ 2 శాతం వరకు పడిపోయాయి. ఎల్ అండ్ టీ కూడా 5 శాతం వరకు పతనం కాగా.. ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై క్లారిటీ లేకపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో దిగుమతి సుంకాల్ని విధిస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఇదే సమయంలో కొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ ఐటీ స్టాక్స్‌ను పడేస్తున్నాయి. వీటికి తోడు తాజాగా యుద్ధ భయాలు మరింత భయాందోళనల్ని రేకెత్తిస్తున్నాయి. దీంతో మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.