: ప్రజలకు బీమాపై కొంత కాలంగా అవగాహన పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో దీని గురించి తెలిసొచ్చింది. ఏదైనా అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు ఉన్న డబ్బంతా ఆస్పత్రిలో పెడితే.. ఇంటికి పెద్ద లేదా ప్రధాన ఆదాయ వనరుకు ఏమైనా అయితే కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బీమా ఆవశ్యకత జనాలకు తెలిసొచ్చింది. కష్టకాలంలా ఇది ఆదుకుంటుంది. కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త బీమా పాలసీలు వస్తూనే ఉన్నాయి. బీమా పాలసీల్లో చాలా రకాలే ఉంటాయి. ఇప్పుడు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకొని టాటాలకు చెందిన టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇదే . ఇక్కడ ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా పూర్తి వైకల్యం సంభవించినా ఇక్కడ పాలసీదారులకు రక్షణ కల్పిస్తుందని చెప్పొచ్చు. వారి కుటుంబానికి భరోసా అందిస్తుంది. ముఖ్యంగా ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అక్కడయ్యే వైద్య ఖర్చుల్ని భరిస్తుంది. ఇన్ పేషెంట్ ఖర్చులు సహా హాస్పిటలైజేషన్‌కు ముందు, తర్వాతా అయ్యే ఖర్చుల్ని చెల్లిస్తుంది. ఇంకా అనుకోని లేదా ఊహించని ప్రమాదాల సమయంలో వ్యక్తులపై రుణ భారం తగ్గించేందుకు ఇక్కడ ఈఎంఐ ప్రొటెక్షన్, లోన్ షీల్డ్ వంటి ఆప్షనల్ కవరేజీలు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు అంటే వారి పైచదువులు, పెళ్లి ఖర్చులకు కూడా టాటా ఏఐజీ పాలసీ ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. అకాడమీ సెషన్లు, వివాహ ఖర్చుల కోసం ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీని వ్యక్తిగతంగా తీసుకోవచ్చు లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లలతో కలిసి జాయింట్‌గానూ తీసుకోవచ్చు. 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. 1-5 ఏళ్ల కాల పరిమితిలో అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు ప్రీమియంలో రాయితీ కూడా అందిస్తోంది.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023లో దేశంలో 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1.73 లక్షల మంది వరకు చనిపోయారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 4 శాతానికిపైగా పెరిగాయి. మృతుల్లో పాదచారులు, సైక్లిస్ట్స్, ద్విచక్రవాహనాలపై వెళ్లేవారి వాటానే 68 శాతంగా ఉంది. అందుకే ఇలాంటి వారి కుటుంబాలకు ఆర్థిక రక్ష కల్పించే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు టాటా ఏఐజీ వెల్లడించింది.