: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం పొందిన తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. గువాహటిలోని లోక్ భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలుసుకున్న ఆయన.. తన మంత్రివర్గ సహచరులతో కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. హిమంత రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆయనను "తాత్కాలిక ముఖ్యమంత్రి"గా కొనసాగాలని కోరారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయంతో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.వంద దాటిన సీట్లు..!126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని కూటమి చేసింది. ఇందులో కేవలం బీజేపీయే ఒంటరిగా 82 స్థానాలను కైవసం చేసుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కూటమిలోని మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ) 10 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఎన్డీయే కూటమిలో నూతనోత్తేజం నెలకొంది.మే 12వ తేదీనే ప్రమాణ స్వీకారం.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ!రాజీనామా సమర్పించిన అనంతరం . మే 11వ తేదీ వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున.. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మే 12న వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. "ఇది అస్సాం చరిత్రలోనే అపూర్వమైన విజయం. అందుకే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించాం. ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని పీఎంఓ వర్గాలు తెలిపాయి" అని హిమంత పేర్కొన్నారు.త్వరలోనే సీఎం ఎంపిక..!కొత్త శాసనసభా పక్ష నేత (ముఖ్యమంత్రి) ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు బీజేపీ అధిష్టానం ఇద్దరు కేంద్ర పరిశీలకులను నియమించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఈ వారాంతంలోగా వారు గువాహటి చేరుకుని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. శాసనసభా పక్ష సమావేశం మే 11 లోపు జరుగుతుందని.. అందులో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారని హిమంత తెలిపారు. అనంతరం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేస్తాయని వివరించారు.