హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్టివిటీ.. ఎయిర్‌పోర్ట్ లైన్‌పై కేంద్రానికి సీఎం స్పెషల్ రిక్వెస్ట్

Wait 5 sec.

హైదరాబాద్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. ఫేజ్-2 కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పటికే కేంద్రానికి చేరిన నేపథ్యంలో దీనికి త్వరితగతిన సాంకేతిక, ఆర్థిక ఆమోద ముద్ర వేయాలని ముఖ్యమంత్రి కోరారు. సుమారు 122.9 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ ప్రాజెక్టు నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాకుండా నలుమూలలా కనెక్టివిటీని పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.ఎంతటి చిత్తశుద్ధితో ఉందో వివరిస్తూ.. గతంలో ఎల్ అండ్ టీ పరిధిలో ఉన్న మెట్రో ఫేజ్-1 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావించారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండటం వల్ల ఫేజ్-2, ఫేజ్-3 పనుల అనుసంధానం, భూసేకరణ, ఇతర సాంకేతిక ప్రక్రియలు మరింత వేగంగా ఆటంకాలు లేకుండా జరుగుతాయని సీఎం వివరించారు. ఈ నిర్ణయం ద్వారా మెట్రో నెట్‌వర్క్ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఫేజ్-2లో భాగంగా ప్రతిపాదించిన ఏడు కారిడార్ల నిర్మాణం సుమారు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ 50:50 నిష్పత్తిలో భరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. కేవలం నగరం లోపలే కాకుండా, నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ప్రతిష్టాత్మకమైన భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో లైనును ఫేజ్-3 కింద చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలిపారు.ఈ సమావేశంలో రవాణా రంగ నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో నిపుణులు ఎన్.వి.ఎస్. రెడ్డి ప్రాజెక్టు సాంకేతిక అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మెట్రో విస్తరణ వల్ల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఐటీ కారిడార్, పాతబస్తీ, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీకి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సీఎం ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.